ComeBack Rally | గ్యాంగ్ రేప్ కేసులో బెయిల్ పొందిన నిందితులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం (Victory Procession) ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ ఘటన కర్ణాటక (Karnataka) హవేరి (Haveri) జిల్లాలో చోటు చేసుకుంది.
సుమారు 16 నెలల క్రితం అంటే 2024 జనవరిలో జిల్లాలోని ఓ హోటల్ గదిలో ఉన్న ఓ జంటపై కొందరు దాడి చేశారు. మహిళను సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి అఫ్తాబ్ చందనకట్టి, మదార్ సాబ్ మండక్కి, సమీవుల్లా లాలనవర్, మహమ్మద్ సాదిక్ అగసిమని, షోయబ్ ముల్లా, తౌసిప్ చోటి, రియాజ్ సవికేరి అనే ఏడుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
అయితే, ఈ ఏడుగురు నిందితులకు హవేరి సెషన్స్ కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారు హవేరిలోని అక్కి ఆలూర్ పట్టణం (Akki Alur town)లో ‘కమ్ బ్యాక్’ ర్యాలీ నిర్వహించారు. బైక్లు, కార్లతో భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా కారు సన్రూఫ్ నుంచి నిందితులు బయటకు వచ్చి కేకలు వేస్తూ, విజయ సంకేతాలు తీస్తూ ర్యాలీ తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Seven men accused of rape in Karnataka get bail ⚖️
And get a grand welcome party with slogans & celebrations 🎉🤦♂️
Justice served, Indian style! 🇮🇳#Karnataka #JusticeSystem #Unbelievable #CrimeNews pic.twitter.com/DETPxR17GW— HK Chronicle (@HK_Chronicle_) May 23, 2025
Also Read..
Amit Shah | ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి దీటైన జవాబు : అమిత్ షా
IndiGo | గగనతలంలో అల్లకల్లోలం.. ఇండిగో అభ్యర్థనను తిరస్కరించిన పాక్