IndiGo | ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు (Turbulence) లోనైన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అదే సమయంలో 200 మందికిపైగా ప్రయాణికులతో శ్రీనగర్ బయల్దేరిన ఇండిగో విమానం 6ఈ2142 గగనతలంలో వడగళ్ల వానలో చిక్కుకుపోయింది. అమృత్సర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. విమానం ముందు భాగం దెబ్బతిన్నది (Aircraft Damaged).
అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సంకేతాలు పంపించారు. ఇక ఈ అల్లకల్లోల్లాన్ని తప్పించుకునేందుకు పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారు. అందుకోసం లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కోరాడు. అయితే, ఇండిగో అభ్యర్థనను లాహోర్ ఏటీసీ (Lahore ATC) తిరస్కరించినట్లు (Pak Rejected IndiGo Pilots Request) సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. కాగా, భారత్తో ఉద్రిక్తత నేపథ్యంలో గతనెల భారత్కు చెందిన విమానయాన సంస్థలకు పాక్ తన గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
Also Read..
Covid-19 | మరో బాలీవుడ్ నటికి కరోనా పాజిటివ్
Muhammad Yunus | రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత..!