Covid-19 | దక్షిణాసియాలో కొవిడ్-19 (Covid-19) మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లోనూ కరోనా వైరస్ (Corona Virus) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar)కు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి కరోనా బారిన పడ్డారు.
హీరోయిన్ నికిత దత్తా (Nikita Dutta)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అ విషయాన్ని నటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనతోపాటు తన తల్లికి కూడా కొవిడ్ సోకినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ఆసియావ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్‌లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్‌లోనూ 257 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, నాలుగు రోజుల క్రితం శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో సూచించారు.
Also Read..
Muhammad Yunus | రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత..!
Aishwarya Rai | తొలిసారి బాడీ షేమింగ్ విమర్శలపై స్పందించిన ఐశ్వర్యరాయ్