Aishwarya Rai | అందం, అభినయంతో అభిమానగణాన్ని పెంచుకుంటూ పోతున్న ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్. ఐదు పదుల వయస్సులోను అంతే గ్లామర్‌తో మంత్ర ముగ్ధులని చేస్తుంది. రీసెంట్గా కేన్స్‌లో రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది ఐష్. తెలుపు రంగు చీర, టిష్యూ డ్రేప్, మెడలో ముత్యాల హారాలు, మెరిసే సిందూరం..ఇలా సంప్రదాయబద్దంగా కేన్స్‌లో రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది ఐశ్వర్యరాయ్. ఆమె పిక్స్, వీడియోస్ నెట్టింట తెగ హల్చల్ చేశాయి. అయితే కొంతకాలంగా ఐశ్వర్యరాయ్ శరీరాకృతి, బరువు పెరగడం వంటి విషయాలపై సోషల్ మీడియాలో జోరుగా ట్రోల్ నడుస్తుంది. దీనిపై తాజాగా స్పందించింది ఐష్.
ఆరాధ్య జన్మించిన తర్వాత కాస్త బరువు పెరిగిన ఐశ్వర్యరాయ్ పలు సందర్భాలలో బాడీ షేమింగ్‌కి గురైంది. అయితే వాటిపై ఎప్పుడు ఐష్ స్పందించింది లేదు. కాని తాజాగా విమర్శలకి తనదైన శైలిలో బదులిచ్చింది. నేను బరువు పెరిగితే మీకొచ్చిన సమస్య ఏంటి? కూతురు పుట్టిన తర్వాత నేను బరువు పెరిగానా లేక ఒంటికి నీరు పట్టిందా అనే విషయాల గురించి మీకెందుకు అంత ఇంట్రెస్ట్. అవి నేను చూసుకుంటాను కదా అని ఐష్ ఘాటైన కామెంట్స్ చేసింది. నా బరువు వలన నాకెప్పుడు సమస్య రాలేదు. కావాలంటే రాత్రికి రాత్రి బరువు తగ్గించుకోగలను. కాని నాకు ఇప్పుడు ఆ అవసరం లేదు.
ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా గురించి ఎవరు ఏమనుకున్నా, ఏం మాట్లాడుకున్నా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఐశ్వర్యరాయ్ కామెంట్ చేశారు. ఇక కొన్ని నెలలుగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ల విడాకుల గురించి కూడా జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. వాటిపై ఏ నాడు ఐష్ స్పందించలేదు. అయితే కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య సిందూరంతో కనిపించడంతో భర్తపై ఉన్న ప్రేమతోనే అలా వచ్చిందని, తమపై వచ్చే రూమర్స్‌కి ఇలా చెక్ పెట్టిందని కొందరు అంటున్నారు. మరి కొందరు ఆపరేషన్ సిందూర్‌కి మద్దతుగా ఐశ్వర్యరాయ్ అలా మెరిసిందని కామెంట్ చేస్తున్నారు.