Local body Elections | రాయపోల్, జులై 26 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా విజయం ఖాయమని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు హనుమండ్ల రాజి రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రమైన రాయపోల్‌లో మాట్లాడుతూ.. నీళ్లు నిధులు నియామకాలపై ఉద్యమించి.. తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించి అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు.
పేద ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేసిన కేసీఆర్‌ను చోటామోటా నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని. ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికి వదిలేసి నాయకులు తరచూ ఢిల్లీకి వెళ్లడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కాళేశ్వరం జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రణాళిక బద్ధంగా ప్రాజెక్టులు నిర్మించి కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని.. ఇందుకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడం తెలంగాణకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడం జరిగిందని పేర్కొన్నారు.
బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీటి వనరులను తరలించుకబోతున్నప్పటికీ.. ఈ ప్రాంత సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని పేర్కొనడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టంకట్టి ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Gajwel | గజ్వేల్‌లో దొంగల హల్చల్.. తాళం వేసిన ఇండ్లలో చోరీలు
నడిరోడ్డుపై గుంతలు.. వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
Motkur : మోత్కూరు- రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై వరి నాట్లతో బీఆర్ఎస్ నిరసన