సింగూరు మరమ్మతులు ఎప్పుడు?
సింగూరు డ్యామ్ మరమ్మతులకు ప్రణాళికలు సిద్ధం చేసి 2 నెలలు గడిచినా అడుగు ముందుకు పడని దుస్థితి నెలకొన్నది. డ్యామ్‌లోని నీటి విడుదలపై హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డు) ససేమిరా అనడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.
- ప్రణాళికలు సిద్ధం చేసి రెండు నెలలైనా ముందుకు పడని పరిస్థితి
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): సింగూరు డ్యామ్ మరమ్మతులకు ప్రణాళికలు సిద్ధం చేసి 2 నెలలు గడిచినా అడుగు ముందుకు పడని దుస్థితి నెలకొన్నది. డ్యామ్‌లోని నీటి విడుదలపై హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డు) ససేమిరా అనడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. ప్రభుత్వమూ పట్టించుకోకపోవడంతో ఇ రిగేషన్శాఖ అధికారులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
రెండు నెలల క్రితమే ప్రణాళికలు
సింగూరు డ్యామ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్(డీఎస్ఆర్పీ) బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా డ్యామ్ భద్రతకు చర్యలు చేపట్టాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదలశాఖ స్పందించింది. ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా డ్యామ్ మరమ్మతులను రెండు దఫాలుగా చేపట్టాలని గత డిసెంబర్లోనే నిర్ణయించింది. రూ.13 కోట్లతో టెండర్ అగ్రిమెంట్లు పూర్తిచేశారు. తొలుత 517.5 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వరకు నీటిని ఖాళీ చేసి, మరమ్మతు లు చేపట్టాలని ప్రతిపాదించారు. రెండో దఫాలో 517.5 నుంచి 510 క్రస్ట్ లెవల్ వరకు మరమ్మతులు నిర్వహించేందుకు ఇరిగేషన్‌శాఖ సిద్ధమైంది. కానీ, ఆ పనులు అక్కడే నిలిచిపోయాయి.
హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ పేచీలు
సింగూర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 29టీఎంసీలు. ఆనకట్ట వాస్తవ డిజైన్ ప్రకారం రిజర్వాయర్ స్థాయిని 517.8 మీటర్లు కాగా, ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం కోసం రిజర్వాయర్ కనీస స్థాయిని 522 మీటర్ల కంటే ఎకువగా నిర్వహిస్తున్నారు. అదీగాక డ్యామ్ పూర్తిగా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నది. మరమ్మతులకు డ్యామ్‌ను ఖాళీ చేయాలని హెచ్ఎండబ్ల్యూఎస్కు లేఖ రాసింది. ఈ ప్రతిపాదనలపై హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ను తోసిపుచ్చడంతో పనులు నిలిచిపోయినట్టు తెలుస్తున్నది. పనులు నిలిచిపోవడంతో ఇరిగేషన్‌శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సైతం నివేదించారు. కానీ, స్పందన రాలేదని తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

