Planting | రాయపోల్, జులై 28 : అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో సోమవారం పెద్ద ఆరేపల్లి పాఠశాలలో వేప, అల్లనేరేడు, మునగా, కరివేపాకు, జంబి మొదలైన రకాల మొక్కలను నాటారు. అదేవిధంగా విద్యార్థులకు ఫ్రూట్ జ్యూస్ అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కుమారస్వామి , లయన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని వారు పేర్కొన్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని.. మొక్కలు పెంచడం ద్వారా భవిష్యత్ తరాల వారికి ఎంతో ఉపయోగపడతాయని గుర్తు చేశారు. విద్యార్థులు పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్ వారి సహకారంతో పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తున్న విషయాన్ని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయిత చంద్రశేఖర్, ఉపాధ్యాయురాలు స్వాతి, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Hathnoora | ఆదాయం ఉన్న సౌకర్యాలు సున్నా.. పలుగు పోచమ్మ ఆలయం వద్ద భక్తుల ఇక్కట్లు
Roads | సారూ మా రోడ్లు బాగు చేయరా.. బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన
Additional collector Nagesh | ప్రాజెక్టులు, చెరువుల దగ్గరికి ఎవరూ వెళ్లొద్దు : అదనపు కలెక్టర్ నగేష్