MLA Kotha Prabhakar Reddy | ఎల్లమ్మ తల్లి అనుగ్రహం ఉంటే ఎండిన నేలల్లో కూడా పచ్చదనం వెల్లివిరుస్తుంది : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Kotha Prabhakar Reddy | తొగుట మండలంలోని వెంకట్రావుపేట లో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ డా: వంటేరు యాదవ రెడ్డితో కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
MLA Kotha Prabhakar Reddy | తొగుట : శక్తి స్వరూపిణి గ్రామాల ఆరాధ్య దేవత రేణుక ఎల్లమ్మ తల్లి మహిమ అపారమని తల్లి ప్రజలందరినీ చల్లంగా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వేడుకున్నారు.. తొగుట మండలంలోని వెంకట్రావుపేట లో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవంలో ఈరోజు అశేష భక్త జనుల మధ్య ఎల్లమ్మ -జమదగ్ని కళ్యాణ మహోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ డా: వంటేరు యాదవ రెడ్డితో కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డప్పుల నాదాలు, మంగళహారతులు, జై ఎల్లమ్మ తల్లి నినాదాల మధ్య ఆలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే మొక్కులు చెల్లించుకుని ప్రజల సుఖసంతోషాలు, రైతుల పంటల సమృద్ధి, యువత భవిష్యత్తు బాగుండాలని ప్రార్థించారు. ఎల్లమ్మ తల్లి అనుగ్రహం ఉంటే ఎండిన నేలల్లో కూడా పచ్చదనం వెల్లివిరుస్తుందని.. భక్తితో కోరుకున్న ప్రతి కోరిక తల్లి కరుణతో నెరవేరుతుందన్నారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి… ఆపదలో అండగా నిలిచే ఆదిశక్తి… ప్రజల గుండెల్లో నిత్యం వెలిగే విశ్వాస దీపం… మన ఎల్లమ్మ తల్లని అమ్మ దయ ఉంటే అంతా క్షేమమే జరుగుతుందన్నారు.
అనంతరం మాతమ్మ దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు బండాకాడి అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. అంతకు ముందు వెంకట్రావుపేటలో మస్కురి సత్యం – కృపల కుమారుడు కోడలు పరంజ్యోతి – భాగ్యశీల వివాహం సోమవారం జరగగా వారిని ఆశీర్వాదించారు. సత్యం కుమార్తె సువర్ణ కుమారుని నామకరణ వేడుకల్లో పాల్గొన్నారు..
ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, సర్పంచ్ లు బండారు కవిత స్వామి గౌడ్, బక్క కనకయ్య, పన్యాల ప్రవీణ్ రెడ్డి నాయకులు వేల్పుల స్వామి, డబ్బికారి పెంటోజీ, మధుసూదన్ రెడ్డి, బోయిని శ్రీనివాస్, పిట్ల వెంకటయ్య, సుతారి రాములు, పాత్కుల బాలేష్, పిట్ల వెంకటేష్, జహంగీర్, వడ్డె నర్సింలు, బెజ్జనమైన కనకరాజు, ఈదుగాళ్ల స్వామి, కత్తుల రమేష్, బెజ్జనమైన నవీన్, అంజి, చంద్రం తదితరులు పాల్గొన్నారు.


Read Also :
KTR | అధైర్యపడొద్దు.. అండగా నిలుస్తాం.. మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే: కేటీఆర్
Petro prices | పెట్రోల్, డీజిల్ ధరలు మరో రూ.20 పెరగనున్నాయా..?
Rakshitha Suresh | ‘హల్లల్లల్లో’తో హాట్ టాపిక్‌గా మారిన సింగర్.. ‘పెద్ది’ పాటతో హాట్ టాపిక్‌గా మారిన రక్షిత సురేష్!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

