KCR Birthday | తొగుట, ఫిబ్రవరి 17: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ఆయన సాకారం చేసిన గోదావరి జలాల మధ్య నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ 72వ జన్మదినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి అనంతరం చందాపూర్‌లోని కూడవెల్లి వాగు మత్తడి వద్ద పొంగిపొర్లుతున్న గోదావరి జలాల మధ్య కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు తొగుట పీహెచ్సీలో మొక్కలు నాటారు. రోగులకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనితర సాధ్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయడంతోపాటు తెలంగాణను 9 ఏళ్లలో దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో ముందు వరుసలో నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ సాధించడంతోపాటు కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణలో గోదావరి జలాలు పారించడంతోపాటు నిధులు, నియామకాలు అందించి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ఫై దుష్పచారం చేస్తుందని, నేడు తాగునీళ్లు, సాగునీళ్లు, నాణ్యమైన కరెంటు, సంక్షేమ పథకాలు కేసీఆర్ చొరవతోనే సాధ్యమయ్యాయన్నారు. మండల ప్రజల పక్షాన కేసీఆర్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏడుపాయల దుర్గమ్మ, కొమురవెల్లి మల్లన్న, యాదాద్రి నర్సింహ్మాస్వామి, కొండపోచమ్మ, వేములవాడ రాజేశ్వర స్వామి ఆశిస్సులతో, మళ్లీ సీఎం కావాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు బక్క కనకయ్య, జి రాజిరెడ్డి, కోల వెంకటేష్ గౌడ్, నాయకులు బాసిరెడ్డి శ్రీకాంత్, చిలువేరి మల్లారెడ్డి, దోమల కొమురయ్య, బోధనం కనకయ్య, వెల్పుల స్వామి, కంది రాంరెడ్డి, కుర్మ యాదగిరి, డబ్బికారి పెంటోజి, సుతారి రమేష్, కొమ్ము శరత్, మంగ నర్సింహులు, నంట పరమేశ్వర్ రెడ్డి, బండారు స్వామిగౌడ్, బిక్కునూరి శ్రీశైలం, మాదాసు అరుణ్ కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ గౌడ్, తగరం ఆశోక్, కర్ణాకర్ రెడ్డి, పులిగారి శివయ్య, బైరాగౌడ్, ఎల్లం, పర్శయ్య, లింగం, ప్రశాంత్, రాజిరెడ్డి, యాదగిరి, భాస్కర్ గౌడ్, రమేష్, అభిద్ హుస్సేన్, సంతోష్, జనార్ధన్ రెడ్డి, వెంకట్ గౌడ్, కర్ణాకర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఆంజనేయులు, బాలరాజు, పిట్ల వెంకటేష్, జహంగీర్, ప్రశాంత్ గౌడ్, శ్రీకాంత్, శివ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం నీళ్లతో కష్టాలు తీర్చిన భగీరథుడు కేసీఆర్..

నిజాంపేట, ఫిబ్రవరి17: కాలేశ్వరం నీళ్లతో రైతుల కష్టాలు తీర్చిన భగీరథుడు తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కెసిఆర్ అని మాజీ ఎంపీపీ సంపత్, మాజీ సర్పంచ్ స్వామి అన్నారు. మంగళవారం నిజాంపేట మండలంలోని నందిగామ బస్ స్టాప్ వద్ద సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి టపాకాయలు కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గెల్లు రాజం నాయకులు బాజా తిరుమల్, బుచ్చ నర్సింలు, కృష్ణ గౌడ్, ఆకుల రాములు తదితరులు ఉన్నారు.

KU |తెలంగాణ అస్థిత్వ శిఖరం కేసీఆర్.. కేయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
Veenavanka | వీణవంకలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
Errabelli Dayakar Rao | పోలీసుల ఓవరాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి : వీడియో