Mayank Yadav | టీ20ల్లో తొలి బంతికే వికెట్.. భారత రెండో పేసర్‌గా మయాంక్..!
Mayank Yadav : అంతర్జాతీయ టీ20ల్లో భారత యువ పేసర్ మయాంక్ యాదవ్(Mayank Yadav) అరుదైన ఫీట్ సాధించాడు.
Mayank Yadav : అంతర్జాతీయ టీ20ల్లో భారత యువ పేసర్ మయాంక్ యాదవ్(Mayank Yadav) అరుదైన ఫీట్ సాధించాడు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన మయాంక్.. జింబాబ్వే పర్యటనలో తొలి బంతికే వికెట్ తీసి రికార్డు నెలకొల్పాడు. 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే మయాంక్.. ఇలా మొదటి బంతికే వికెట్ తీయడం ఇది మూడోసారి. తద్వారా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvaneshwar Kumar) సరసన నిలిచాడీ యువ స్పీడ్‌స్టర్.
ఐపీఎల్లో సూపర్ ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాటర్లను భయపెట్టిన మయాంక్ యాదవ్ జింబాబ్వే పర్యటనలో చెలరేగుతున్నాడు. మూడో టీ20లో తొలి బంతికే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్(Brian Bennett)ను ఔట్ చేసిన మయాంక్ అంతర్జాతీయంగా మూడోసారి ఈ ఫీట్ సాధించాడు. దాంతో, పొట్టి ఫార్మాట్లో మూడు పర్యాయాలు మొదటి బంతికే వికెట్ తీసిన భారత రెండో పేసర్‌గా మయాంక్ రికార్డు పట్టేశాడు.
MASTERCLASS!
Mayank Yadav First Ball Wicket Again caught by Vaibhav Sooryavanshi safe hand!#indvszim pic.twitter.com/5R8NgfPur1— Sunil Gavaskar (@virender_swag) July 26, 2026
మయాంక్ కంటే ముందు భువనేశ్వర్ కుమార్ మూడుసార్లు ఫస్ట్ బాల్కే వికెట్ పడగొట్టాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్‌లు రెండుసార్లు, మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు ఒకసారి మాత్రమే తొలి బంతికే వికెట్ తీశారు.
మయాంక్ 2024లో బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగిన టీ20లోఓపెనర్ పర్వేజ్ హొసేన్‌ను తొలిబంతికే ఔట్ చేశాడు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత జింబాబ్వే పర్యటనకు ఎంపికైన అతడు.. రెండు మ్యాచుల్లో ఓపెనర్ బ్రియన్ బెన్నెట్‌ను మొదటి బంతికే ఔట్ చేసి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

