Farmers | తొగుట, ఏప్రిల్ 12 : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తొగుట సొసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని వరదరాజుపల్లి, గోవర్ధనగిరి, కాన్గల్, లింగంపేట, రాంపూర్, చందాపూర్, వెంకట్రావుపెట, జప్తిలింగారెడ్డిపల్లి గ్రామాల్లో PACS, ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఇవాళ కె హరికృష్ణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడ్లు అమ్మే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం రైతులకు క్వింటాల్ వరి ధాన్యానికి రూ.2,320 మద్దతు ధర కల్పిస్తుందని తెలిపారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే కొనుగోళ్లు వేగవంతం అవుతాయని తెలిపారు. రైతులు ఎవరూ కూడా దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, మండల వ్యవసాయధికారి మోహన్, మాజీ సర్పంచ్ బొడ్డు నర్సింలు, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, ఆర్ఐ అశోక్, సొసైటీ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్, మహిపాల్ రెడ్డి, పాత్కుల ఎల్లయ్య, ఏఐఓ సాయికుమార్, సీసీలు వరలక్ష్మి, విజయ, భాస్కర్, విఓఏ లు, గ్రామ సమైక్య అధ్యక్షురాలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!