కారేపల్లి, ఫిబ్రవరి 28 : కారేపల్లి మండలం గోవింద్తండా ప్రభుత్వ పాఠశాలకు అదే గ్రామానికి చెందిన బర్మావత్ కోటేశ్వరరావు (కోటి) మైక్, మౌత్ స్పీకర్ను వితరణ చేశారు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో దాత మైక్, మౌత్ స్పీకర్ను పాఠశాల హెచ్ఎం కె.రవికి అందజేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావును హెచ్ఎం అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తే వారు ఉన్నత స్ధాయికి ఎదుగుతారని, పాఠశాల ఉన్నతికి గ్రామస్తులు సహకరించాలని హెచ్ఎం కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు దేవిక, గ్రామ పెద్దలు పాల్తియా వీరన్న, పులిబుజ్జ జానయ్య, బర్మావత్ లక్ష్మణ్ పాల్గొన్నారు.