BRS Leader | తొగుట, నవంబర్ 13 : తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఘనపూర్‌కు చెందిన కొమ్ము కిషన్ (50) అకాల మరణం తీరని లోటని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన కొమ్ము కిషస్ భౌతిక కాయానికి ఆయన పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిషన్ మరణం పట్ల దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేయడం జరిగిందని, ఆయన సహకారంతో వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
2001 నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని, ఉద్యమ కాలంలో జైలుకు సైతం వెళ్లాడని గుర్తు చేశారు. కిషన్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని.. తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, ఘనపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా, వార్డ్ మెంబర్‌గా పనిచేశారన్నారు. ఆయన భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలను ఓదార్చారు. బీఆర్ఎస్ పార్టీకి ఎంతో వెన్నుదన్నుగా ఉన్న కిషన్ మరణం పార్టీకి తీరని లోటని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం అందించాలని ఆ భగవంతున్ని కోరుకున్నారు.
పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు చిలువేరి మల్లారెడ్డి, కుర్మ యాదగిరి, బోధనం కనకయ్య, సిరినేని గోవర్ధన్ రెడ్డి, గంగనిగల్ల మల్లయ్య, కొమ్ము శరత్, మంగ నర్సింలు, ఎల్లం, బాలరాజు, నరేందర్ గౌడ్, యాదగిరి, రాజశేఖర్, మల్లేశం గౌడ్, రాంబాబు తదితరులున్నారు.

Ambati Rambabu | వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదం.. వెలుగులోకి కొత్త వీడియో