Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన కీలక దృశ్యాలు బయటకొచ్చాయి. బస్సు ప్రమాదం జరగడానికి ముందు ఆ మార్గంలో వెళ్లిన ప్రైవేటు బస్సు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అందులో బస్సు ఢీకొనడానికి ముందే శివశంకర్ బైక్ ప్రమాదానికి గురైనట్లు ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
బస్సు ఢీకొనడానికి ముందే ప్రమాదం జరిగిందని బైకర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రి స్వామి గతంలోనే తన స్టేట్మెంట్ ఇచ్చాడు. ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని ఎర్రి స్వామి పోలీసులకు చెప్పాడు. శివశంకర్ అక్కడికక్కడే మరణించడానికి తనకు గాయాలయ్యాయని పేర్కొన్నాడు. శివశంకర్ మృతదేహాన్ని రోడ్డు పక్కకు లాగుతున్న క్రమంలోనే బస్సు వచ్చి బైక్‌ను ఢీకొట్టిందని వివరించాడు. కానీ దీనిపై కొద్దికాలంగా అస్పష్టతనే ఉంది. ఈ క్రమంలో తాజాగా బయటకొచ్చిన వీడియో.. ఎర్రిస్వామి చెప్పిందే నిజమని తేల్చింది.
ప్రమాదవశాత్తూ బైక్ కుడి పక్కకు పడిపోగా.. మృతిచెందిన శివశంకర్‌ను ఎడమ వైపునకు లాగిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. బైక్ రోడ్డు మధ్యలో పడి ఉండటం గమనించి పలు వాహనాలు మెల్లిగా వెళ్లాయి. అయితే అది గమనించని వేమూరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ బైక్‌పై నుంచి పోనిచ్చాడు. దీంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ రోడ్డుకు గీసుకుపోవడంతో మంటలు చెలరేగి, బస్సుతో పాటు 19 మంది ప్రయాణికులు సజీవ దగ్ధమయ్యారు.
#KurnoolBusFire incident Update:
Before the #VemuriKaveriTravels #BusFire incident in #Kurnool.. many vehicles went on the same route after the bike accident.. but no one paid any attention.
A shocking incident recorded in #CCTV of another bus :
After the bike accident..… https://t.co/jSAWZYUO0H pic.twitter.com/KRRACAH0fo
— Surya Reddy (@jsuryareddy) November 13, 2025