International Yoga Day | హుస్నాబాద్ టౌన్, జూన్ 21: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లావ్యాప్తంగా యోగా డేను ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్‌లో పలు ప్రాంతాల్లో యోగా దినోత్సవం నిర్వహించారు. స్థానిక హుస్నాబాద్ కోర్టులో జరిగిన యోగా దినోత్సవాల్లో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రేవతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం యోగా చేయడం అలవాటు చేసుకోవాలని మనతోపాటు మన పిల్లలకు సైతం యోగాను నేర్పించాలని సూచించారు.
మానసిక శారీరక ఒత్తిళ్లను యోగా దూరం చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని జడ్జి రేవతి చెప్పారు. అలాగే స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగ దినోత్సవం లో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ ఐలైన అనిత ఆధ్వర్యంలో, ఎల్లమ్మ చెరువు కట్టపై ఎం ఎం డి గ్రూప్ ఆధ్వర్యంలో యోగ దినోత్సవం నిర్వహించగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, న్యాయవాది సాయిని మల్లేశం, సబ్బని శ్రీదేవి, నీలం సంపత్ కుమార్ తో పాటు పలువురు హాజరయ్యారు.
గజ్వేల్ పట్టణంలో ఘనంగా యోగా డే
గజ్వేల్, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ ఆవరణంలో యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా సెయింట్ మెరీస్ విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థులు యోగాసనాలు వేశారు. పాఠశాల విద్యార్థులు యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల్లో యువకులు యోగాసనాలు వేశారు.
దౌల్తాబాద్ మండలంలో ఘనంగా యోగా దినోత్సవం
రాయపోల్, జూన్ 20 : దౌల్తాబాద్ మండలంలోని అన్ని పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఘనంగా యోగా డేను నిర్వహించారు. ఈ సందర్బంగా దౌల్తాబాద్ మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు మాట్లాడుతూ.. యోగా అనేది శారీరక దృఢత్వానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి చాలా తోడ్పడుతుందన్నారు.
యోగా ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఔషధంలా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి రోజు యోగా చేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు యోగాలో ముందుండాలని.. ప్రతిరోజు ఉదయం యోగా చేయడం ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్