Honey Soaked Onion | కూరలు చేసేందుకు మనం రోజూ ఉల్లిపాయలను ఉపయోగిస్తామన్న సంగతి తెలిసిందే. ఉల్లిపాయలు లేకుండా మనం అసలు ఏ కూరలను పూర్తి చేయలేము. ప్రతి కూర లేదా వంటకంలోనూ ఉల్లి కచ్చితంగా ఉంటుంది. ఉల్లిపాయల్లోనూ అనేక రకాలు ఉంటాయి. అయితే సైజులో కాస్త చిన్నగా ఉన్న ఉల్లిపాయలను తీసుకోవాలి. వీటిని ఒక సీసాలో వేసి ఇవి మునిగేంత వరకు తేనె పోయాలి. ఇలా ఉల్లిపాయలను తేనెలో ఒక రోజంతా నానబెట్టాలి. తరువాత వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి రోజుకు ఒకటి చొప్పున ఉదయం పరగడుపునే తింటుండాలి. ఒకసారి ఇలా మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకుని వారం రోజుల వరకు తినవచ్చు. కానీ ఫ్రిజ్‌లో నిల్వ చేసి తినాలి. లేదంటే ఉల్లిపాయలు పాడవుతాయి. అయితే ఇలా తేనెలో నానబెట్టిన ఉల్లిపాయలను తినడాన్ని కొన్ని వర్గాలకు చెందిన సంప్రదాయ వైద్య విధానంలో పాటిస్తారు. ఈ క్రమంలోనే ఇలా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు సైతం చెబుతున్నారు.
తేనెలో నానబెట్టిన ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాల శాతం పెరుగుతుంది. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటాయి. ఈ ఉల్లిపాయల్లో క్వర్సెటిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయడంతోపాటు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను సైతం కలిగి ఉంటుంది. ఈ మిశ్రమంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే క్రోమియం షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. శరీరం ఇన్సులిన్‌ను ఉపయోగించుకునేలా చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాల వల్ల రోగాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇన్ ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు.
ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. తేనెలో నానబెట్టిన ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించవచ్చు. దీంతో కణాలకు నష్టం జరగకుండా అడ్డుకోవచ్చు. దీని కారణంగా గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా ఉంటాయి. ఈ మిశ్రమాన్ని తింటుంటే సహజసిద్ధమైన డిమల్సెంట్గా పనిచేస్తుంది. అంటే దగ్గు నుంచి ఉపశమనాన్ని అందిస్తుందన్నమాట. గొంతులో గరగర, గొంతు నొప్పి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఈ ఉల్లిపాయలు జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దీంతో జీర్ణ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
తేనెలో నానబెట్టిన ఉల్లిపాయలను తింటుంటే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా కొందరికి దగ్గు, జలుబు, జ్వరం తరచూ వస్తుంటాయి. అలాంటి వారు ఈ మిశ్రమాన్ని తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా కోలుకుంటారు. రోగాలు త్వరగా తగ్గుతాయి. గాయాలు, పుండ్లు సైతం త్వరగా మానిపోతాయి. ఈ మిశ్రమం రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. షుగర్ అధికంగా ఉన్నవారు ఇలా తేనెలో నానబెట్టిన ఉల్లిపాయలను తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్ తగ్గిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకోవచ్చు. పలు క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. ఇలా తేనెలో నానబెట్టిన ఉల్లిపాయ మిశ్రమం మనకు అనేక రకాలుగా పనిచేస్తుంది.