ముకరంపుర, జూన్ 21: పాత పెన్షన్ (Pension) విధానాన్ని వర్తింప జేయాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో మాదిరిగానే విద్యుత్ సంస్థలో 1999 నుంచి 2004 సంవత్సరం వరకు చేరిన ఉద్యోగులందరికి పాత పెన్షన్ (జీపీఎఫ్)ను వర్తింపచేయాలని కోరారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంకు వినతి పత్రాలు అందజేశారు.
ప్రభుత్వం ఎస్బీఐ, యూనియన్ బ్యాంకుల ద్వార విద్యుత్ ఉద్యోగులకు రూ.కోటి బీమా పథకాన్ని అమలు చేస్తూ పెద్ద సహాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నాయిని అంజయ్య, భాస్కర్, శ్రీనివాస్, సంపత్, కొలుపుల రాజు, సత్యనారాయణ, శ్రీనివాస్, అరవింద్ రెడ్డి, శ్రీనివాస్, వీరయ్య, శ్రీమతి, తదితరులు పాల్గొన్నారు.