Blackheads | చాలా మంది ఎదుర్కొనే వివిధ రకాల చర్మ సమస్యల్లో బ్లాక్‌హెడ్స్ కూడా ఒకటి. ఇది చాలా సాధారణమైన చర్మ సమస్య అని చెప్పవచ్చు. ఆయిల్ చర్మం ఉన్న వారిలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా ముక్కు, గడ్డం, నుదురు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. చర్మపు రంధ్రాలు అధిక ఆయిల్, మృత కణాలు, ధూళితో మూసుకుపోయినప్పుడు బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. వైట్హెడ్స్లా కాకుండా బ్లాక్‌హెడ్స్ చర్మం పైభాగంలో ఓపెన్‌గా ఉంటాయి. రంధ్రాల్లో చిక్కుకున్న పదార్థం గాలిలోని ఆక్సిజన్‌తో ప్రతిచర్యకు లోనై నలుపు రంగులోకి మారుతుంది. ఈ పరిస్థితిని వైద్యపరంగా Acne అని అంటారు. తీవ్రమైన బ్లాక్‌హెడ్స్ తో బాధపడే వారు తప్పకుండా చర్మ వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సహజ చిట్కాలను ఉపయోగించి కూడా బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. బ్లాక్‌హెడ్స్ ను తగ్గించే కొన్ని సహజ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె, నిమ్మకాయ మాస్క్ ను ఉపయోగించి బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. తేనెలో సహజ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. నిమ్మకాయలో మృదువైన ఎక్స్‌ఫోలియేటింగ్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఈ మాస్క్ ను తయారు చేసుకోవడానికి ఒక టీ స్పూన్ తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతాల్లో సున్నితంగా రాయాలి. దీనిని 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ మాస్క్ చర్మ రంధ్రాలను శుభ్రపరచి ఆయిల్ పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు నిమ్మరసాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. అలాగే ముఖానికి ఆవిరి పట్టడం ద్వారా రంధ్రాల్లో చిక్కుకున్న మలినాలను తొలగిపోతాయి. నీటిని మరిగించి, ముఖానికి సురక్షిత దూరంలో 5 నుంచి 10 నిమిషాలు ఆవిరి తగిలేలా ఉండాలి. వేడి వల్ల చర్మం మృదువుగా మారి రంధ్రాలు తెరుచుకుంటాయి. తర్వాత మృదువుగా ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల బ్లాక్‌హెడ్స్ తొలగిపోతాయి. అయితే ఎక్కువసార్లు స్టీమ్ చేయడం చర్మానికి ఇబ్బంది కలగవచ్చు.
అలాగే బేకింగ్ సోడాను ఉపయోగించి కూడా బ్లాక్‌హెడ్స్ ను తొలగించుకోవచ్చు. కొద్దిగా బేకింగ్ సోడాలో నీరు కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్ ను బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతాల్లో రాసి మృదువుగా ఒక నిమిషం పాటు మసాజ్ చేసి, తర్వాత నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ ను నుండి ఉపశమనం కలుగుతుంది. బేకింగ్ సోడా కొంచెం గరుకుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా ఉపయోగించకూడదు. అలోవెరా జెల్ కూడా బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. అలోవెరా చర్మాన్ని శాంతింపజేసే, తేమను అందించే లక్షణాలను కలిగి ఉంటుంది. తాజా అలోవెరా జెల్‌ను ముఖానికి రాసి 10-15 నిమిషాల తర్వాత కడగాలి. ఇది చర్మంలోని ఆయిల్‌ను తగ్గించి రంధ్రాలు మూసుకుపోకుండా సహాయపడుతుంది. గ్రీన్ టీని ఉపయోగించి కూడా బ్లాక్ హెడ్స్ తొలగిపోయేలా చేయవచ్చు. తడి గ్రీన్ టీ ఆకుల్లో కొద్దిగా నీరు లేదా తేనె కలిపి ముఖంపై రాసి మృదువుగా మసాజ్ చేయాలి. ఇది చర్మంపై ఉన్న మలినాలను తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
ఈ చిట్కాలను ఉపయోగించి సులభంగా బ్లాక్ హెడ్స్ తొలగిపోయేలా చేయవచ్చు. వీటితో పాటు రోజుకు రెండు సార్లు ముఖం శుభ్రం చేసుకోవడం, Non-comedogenic స్కిన్‌కేర్ ఉత్పత్తులు ఉపయోగించడం, తరచుగా మృదువుగా చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం, తగినంత నీరు తాగడం వంటివి చేయడం వల్ల కూడా బ్లాక్ హెడ్స్ రాకుండా ఉంటాయి. అయితే బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడే వారు వాటిని బలంగా రుద్దడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల చర్మానికి నష్టం కలగడంతో పాటు చర్మంపై మచ్చలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇటువంటి సహజ చిట్కాలను ఉపయోగించి చాలా సులభంగా బ్లాక్ హెడ్స్ సమస్య నుండి బయటపడవచ్చు. అయితే ఈ సమస్య తీవ్రంగా ఉన్న వారు చర్మ వైద్యుడిని సంప్రదించడం మంచిది.