Land Issues | కోహెడ జూన్ 19 : రైతులకు భూ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ అబ్ధుల్ హమీద్ అన్నారు. గురువారం రెవెన్యూ అధికారులు వింజపల్లిలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యల పరిష్కారానికి భూభారతి తీసుకువచ్చిందని.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
మండలంలోని అన్ని గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించటం జరుగుతుందని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులను విజయవంతం చేసిన రెవెన్యూ సిబ్బందిని జాయింట్ కలెక్టర్ అబ్ధుల్ హమీద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్సీ చైర్మన్ బోయిని నిర్మల-జయరాజ్, డిప్యూటి తహసీల్దార్ దేవేంద్ర, ఆర్ఐ ఎల్లయ్య, రెవిన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు