Farooq Hussain | రాయపోల్, డిసెంబర్ 16 : గ్రామాల్లో పేదలకు ఆపద సంపద ఉంటే తాను ఎల్లప్పుడూ అండగా ఉండి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నానని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని
మంతూర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన బొడ్డు మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొడ్డు మల్లయ్య తనకు 30 సంవత్సరాలు అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనకు పదవి ఉన్నా లేకున్నా ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రాంత ప్రజలతో 30 సంవత్సరాలు అనుబంధం ఉందని. ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోనిలేనిదని పేర్కొన్నారు. రాజకీయాలు ఎప్పటికీ శాశ్వతం కాదని. పదవిలో ఉన్నప్పుడు ప్రజల మధ్యన ఉండి ప్రజల హృదయాలను గెలుచుకోవాలని అన్నారు.
దుబ్బాక నియోజకవర్గం ప్రజల మద్దతుతో తాను ఈ స్థాయికి ఎదిగానని వారి రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా పదవి ఉన్నా లేకున్నా పేదల స్థితిగతులను అర్థం చేసుకుని దాతల సహకారంతో పేదలకు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించామని గుర్తు చేశారు. ముఖ్యంగా రంజాన్, దసరా పండుగలకు కుల మతాలకు అతీతంగా అందరికీ సహాయం అందించామని గుర్తు చేశారు. తనకు రాజకీయాలపై దృష్టి లేదని.. అవకాశం వస్తే ప్రజల ఆదరాబాభిమానాల మేరకు పనిచేస్తామని పేర్కొన్నారు.
కేసీఆర్ పేదలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు..
తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పేదలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ పోరులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. మాజీమంత్రి హరీష్ రావు.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఆయన వెంట మంతూర్ నూతన సర్పంచ్ పర్వేజ్ అహ్మద్, రాయపోల్ తాజా మాజీ జెడ్పిటిసి యాదగిరి. ఉమ్మడి మండల బీఆర్ఎస్ నాయకులు చింతకింది మంజూరు. పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

45 Official Trailer | శివన్న – ఉపేంద్రల మెగా మల్టీస్టారర్.. ’45’ ట్రైలర్ విడుదల