45 Official Trailer | కన్నడ అగ్ర నటులు శివ రాజ్‌కుమార్ (Shivarajkumar), ఉపేంద్ర (Upendra) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ’45’ (45). ఈ సినిమా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, ఉపేంద్రతో పాటు రాజ్ బి. శెట్టి కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా విభిన్నమైన కథాంశంతో, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ (VFX) కు అధిక ప్రాధాన్యం ఇస్తూ రూపొందినట్టు స్పష్టమవుతోంది. ఉపేంద్ర తన గత చిత్రాల మాదిరిగానే ఇందులోనూ ఒక డిఫరెంట్, ఛాలెంజింగ్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం డిసెంబరు 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుండగా తెలుగు ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని వారం ఆలస్యంగా, జనవరి 1న కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేయనున్నారు.