Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత పవన్‌కి ఓజీ రూపంలో బ్లాక్ బస్టర్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ‘ఓజీ’ (OG) చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం.. నటుడు పవన్ కళ్యాణ్ చిత్ర దర్శకుడు సుజిత్ (Sujeeth)కు అద్భుతమైన బహుమతిని అందించారు. ‘ఓజీ’ సాధించిన అద్భుత విజయానికి సంతోషించిన పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్‌కు లగ్జరీ కారు (Luxury Car) ని బహుమతిగా ఇచ్చారు. ప్రముఖ కార్ల కంపెనీ లాండ్ రోవర్(Land Rover)కి చెందిన రేంజ్ రోవర్(Range rover) లగ్జరీ కారుని సుజిత్‌కి గిప్ట్గా ఇచ్చాడు. కాగా ఈ విషయాన్ని సుజిత్ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.
”నేను అందుకున్న బహుమతుల్లో ఇది అత్యుత్తమమైనది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా, కృతజ్ఞతతో నిండిపోయాను. నా అత్యంత ప్రియమైన ఓజీ, కళ్యాణ్ గారి నుండి లభించిన ఈ ప్రేమ, ప్రోత్సాహం నాకు అన్నిటికంటే ముఖ్యం. చిన్ననాటి నుంచి ఆయన అభిమానిగా మొదలై ఈ ప్రత్యేక క్షణం వరకు… ఇది నిజంగా అద్భుతం. జీవితంలో ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను”. అంటూ సుజిత్ రాసుకోచ్చాడు.

Pawan Kalyan Director Sujith

Pawan Kalyan

Pawan Kalyan Sujith