Nano Urea | రాయపోల్, ఆగస్టు 07 : రైతులకు నానో యూరియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం శౌరీపూర్ గ్రామంలో గురువారం మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ ప్రవేశించినప్పటి నుండి రకరకాల ఆవిష్కరణలు జరుగుతున్నాయని.. అందులో భాగంగానే అద్భుతమైన ఆవిష్కరణ ఈ నానో యూరియా.. దీనివల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని .. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. నానో యూరియా మొక్కలలో పచ్చదనం, చురుకైన పెరుగుదల, పంట అభివృద్ధికి దోహదపడుతుందని తెలియజేశారు.
నానో యూరియా వలన ఉపయోగాలు..
నానో యూరియా కణాలు చాలా చిన్న పరిమాణం (20-50 n.m) కలిగి ఉండటం వలన, పంటకు దాని లభ్యత 80% కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్కల నత్రజని అవసరాన్ని సమర్థవంతంగా తీరుస్తూ , ఆకులలో కిరణ జన్య సంయోగ క్రియను పెంచుతుంది అన్నారు. వేర్లల్లో కణజాలమును వృద్ది చెందిస్తుంది. ఉపయోగకరమైన పిలకలను, శాఖలను పెంచుతుందన్నారు. ఇది పంట ఉత్పాదకతను పెంచి పంట సాగు ఖర్చు తగ్గించటం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచుతుందన్నారు. దీని యొక్క వినిమయ సామర్థ్యం అధికంగా ఉన్నందున ఇది సాంప్రదాయ యూరియా అవసరాన్ని 50% లేదా అంతకంటే ఎక్కువ తగ్గించగలదు ..
పని చేయు విధానం :
నానో యూరియాను ఆకుల మీద పిచికారి చేసినప్పుడు ఇది ఆకుల రంధ్రాల ద్వారా సులభంగా ఆకులలోకి ప్రవేశించును. కణజాలం సులువుగా పీల్చుకొనును. పంట అవసరాలకు అనుగుణంగా మొక్కలోనికి ప్రవేశించిన స్థలం నుండి మొక్క యొక్క వివిధ వినిమయ ప్రాంతాలకు దారుణాలముల ద్వారా సులభంగా పంపిణీ చేయబడుతుంది నీ అన్నారు. ఉపయోగించని నత్రజని మొక్క యొక్క ఖాళీ ప్రదేశం లో నిల్వ చేయబడుతుంది .. అవసరం అయినప్పుడు మొక్క యొక్క పెరుగుదల, అభివృద్ధి కోసం నెమ్మదిగా విడుదల అవుతుంది. నానో యూరియా వివరాలు 500 మి.లీ. నానో యూరియా బాటిల్ = 45 కిలోల సాధారణ యూరియా బ్యాగ్‌కు సమానం.
బాటిల్లో 20% నైట్రోజన్ ద్రవ రూపంలో ఉంటుంది.నానో యూరియా ధర – ₹225 మాత్రమే.సాధారణ యూరియా ఖర్చు:
యూరియా బ్యాగ్ – ₹290
రవాణా ఖర్చు – ₹30
అప్లికేషన్ లేబర్ ఖర్చు – ₹150
మొత్తం ఖర్చు – ₹470 మొక్కలు 100 కిలోల సాధారణ యూరియాలో 30 కిలోల నైట్రోజన్ మాత్రమే గ్రహిస్తాయి. మిగిలిన 70 కిలోలు వృథా అవుతుంది (లీచింగ్, బాష్పీభవనం ద్వారా), ఇది నీటి మరియు నేల కాలుష్యానికి కారణమవుతుందని అన్నారు.
నానో యూరియా వాడితే : ఖర్చు తగ్గుతుంది ఇతర శిలీంద్రనాశకాలు/పురుగుమందులతో కలిపి స్ప్రే చేయవచ్చు
ఒకే స్ప్రేలో రెండు పనులు పూర్తవుతాయి
స్ప్రేయింగ్ ఎలా చేయాలి..?
ఆకులపై మాత్రమే పిచికారీ చేయాలి. డ్రిప్‌లో లేదా నేలలో వాడకూడదు. 1 లీటరు నీటికి 2–5 మి.లీ. నానో యూరియా కలపాలి.20 లీటర్ల స్ప్రేయర్‌కు: మొక్క ప్రారంభ దశలో – 80 మి.లీ. పుష్పించే దశలో – 100 మి.లీ. మొక్క ప్రారంభ దశలో నానో యూరియా స్ప్రే చేస్తే: మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మొదటి దశలో అవసరమైన నైట్రోజన్ అందుతుంది నానో యూరియాను స్ప్రే చేసిన తర్వాత: ఇది ఆకులలోకి చొచ్చుకుపోయి మొక్క కణాల్లో నిల్వ ఉంటుందిఅవసరమైనప్పుడు నైట్రోజన్‌ను విడుదల చేస్తుంది 15–20 రోజులు వరకూ నత్రజనిని అందిస్తుంది నానో యూరియా వాడితే పంట దిగుబడి సగటుగా 8% పెరుగుతుంది.
సాధారణ యూరియా వాడే ఏ పంటకైనా నానో యూరియా వాడవచ్చు. నానో DAP వివరాలు 500 మి.లీ. నానో DAP బాటిల్ = ఒక బ్యాగ్ సాధారణ DAPకు సమానం.నానో DAP ధర – ₹600. ఈ ద్రవ DAPలో నైట్రోజన్ మరియు ఫాస్పరస్ సమంగా అందుతాయి.
విత్తన శుద్ధి కోసం:
5 మి.లీ. నానో DAPను 250 మి.లీ. నీటిలో కలపాలి
1 కిలో విత్తనాలను ఈ ద్రావణంలో ముంచి 3–4 గంటలు నీడలో ఉంచాలి
వేరు శుద్ధి కోసం (వరిలో):
పొలంలో చిన్న కుంట చేయాలి. అందులో 150–200 లీటర్ల నీరు పోసి, 1 బాటిల్ నానో DAP కలపాలి వరి వేర్లను 2–3 గంటలు ఈ ద్రావణంలో ముంచి నాటాలి ఫోలియర్
స్ప్రేయింగ్ కోసం:
1 లీటరు నీటికి 4–5 మి.లీ. నానో DAP కలపాలి.
పత్తి పంటలో స్ప్రేయింగ్:
విత్తిన 25 రోజుల తర్వాత – ఒక స్ప్రేయర్‌కు 80 మి.లీ.రెండవ దశ స్ప్రేయింగ్ – ఒక స్ప్రేయర్‌కు 100 మి.లీ.
భీమా సమాచారం – సంకటహరణ భీమా
ఇఫ్కో కంపెనీ ప్రతి నానో యూరియా మరియు నానో DAP బాటిల్‌పై ₹10,000 విలువైన భీమా అందిస్తుంది.
దీనిని సంకటహరణ భీమా అంటారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని అధిక పంటలను పండించే విధంగా రైతులు ఈ సూచన మేరకు నానో యూనియన్ వాడాలని ఆయన పేర్కొన్నారు.
COtton Crop | పత్తిలో అంతర పంటల సాగుతో చీడ పీడల నివారణ : శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పల్లవి
Harish Rao | రెండేండ్ల కాంగ్రెస్ పాలన ప్రజలను కష్టాల పాలు చేసింది : హరీశ్ రావు
BRS | కార్యకర్తలకు బీఆర్ఎస్ పాటీ అండగా ఉంటుంది : వల్లుంపల్లి కరుణాకర్