చేర్యాల, ఆగస్టు 7 : కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎంపీపీ వల్లుంపల్లి కరుణాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మల్లిగారి మురళి అనారోగ్యంతో మృతి చెందగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది.
మాజీ ఎంపీపీ కరుణాకర్ బీఆర్ఎస్ నాయకుల తో కలిసి మృతుడి కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీనే కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రజ్ఞాపురం నర్సింహులు, జీడాల నవీన్‌కుమార్, బండకింది సత్యనారాయణగౌడ్, వుల్లంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.