తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణం
తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా బుధవారం బాధ్యతలు చేపట్టారు. లోక్‌భవన్‌లో ఉదయం శివప్రతాప్ శుక్లాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్ తెలుగులో ప్రమాణం చేయించారు.
- ప్రమాణం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్
- హాజరైన సీఎం, మండలి చైర్మన్, స్పీకర్, మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- తెలుగులో ప్రమాణం చేసిన కొత్త గవర్నర్
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా బుధవారం బాధ్యతలు చేపట్టారు. లోక్‌భవన్‌లో ఉదయం శివప్రతాప్ శుక్లాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్ తెలుగులో ప్రమాణం చేయించారు. అనంతరం గవర్నర్ శివప్రతాప్‌సింగ్ శుక్లా మాట్లాడుతూ.. ‘నాపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ అంటే సాంస్కృతిక సంపద, గొప్ప సంప్రదాయాలు, అసాధారణ పురోగతికి నిదర్శనం. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి, క్యాబినెట్ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు.
అందరం కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలను గౌరవిస్తూ ముందుకు సాగుదామని విశ్వసిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ శుక్లాకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతోపాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన శివప్రతాప్ శుకా ్ల ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. యూపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా, సహాయ మంత్రిగా పనిచేశారు. 2023-26 మధ్య హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

