Power Cuts | రాష్ట్రంలో కరెంట్ కట కట.. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో మొదలైన అప్రకటిత కోతలు
Power Cuts | కరెంట్ కటకట మొదలైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Power Cuts | హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): కరెంట్ కటకట మొదలైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలో గంట వ్యవధిలోనే రెండు మూడుసార్లు కరెంట్ పోవడం సాధారణమైందని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ శాఖ అధికారులు ప ట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తంచేస్తున్నారు.
ఐటీ ఉద్యోగుల అష్టకష్టాలు
విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో ఐటీ ఉద్యోగులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. ఇదే విషయమై టీజీఎస్పీడీసీఎల్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని మండిపడుతున్నారు. ఇక ఇదే విషయమై టీజీఎస్పీడీసీఎల్కు ‘ఎక్స్’ వేదికగా ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు.
చిరువ్యాపారుల తిప్పలు
తరచూ కరెంట్ అంతరాయం కారణంగా జిరా క్స్, ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల నిర్వాహకులు, వెల్డింగ్షాపుల నిర్వాహకులు ఇబ్బందు లు పడుతున్నారు. కరెంట్ కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నదని చెబుతున్నారు. ఉపాధికి గండిపడుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

