Goats | తొగుట, ఆగస్టు 19 : మేత కోసం వెళ్లిన మేకలు మృత్యువాత పడ్డ పడ్డాయి. ఈ ఘటన తొగుట మండల పరిధిలోని లింగాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లింగాపూర్ గ్రామానికి చెందిన కొంగరి లింగం, ఎరుకల రాజయ్య, ఇద్దరు వ్యక్తులు ఉదయం మేకలను రోజూ మాదిరిగా మేత కోసం బయటకు కొట్టుకునిపోయారు. అయితే మేకలు మేత మేసుకుంటూ అక్కడి పరిసరాల్లో ఉన్న వరిపంటలోని నీళ్లు తాగాయి. అయితే రైతులు ఆ వరి పంటకు క్రిమిసంహారక మందులను పిచికారి చేశారు.
అప్పుడే వర్షం రావడంతో వరి పంటలో ఉన్న నీటితో క్రిమిసంహారక మందు కూడా కలిసి బయటకు రావడంతో.. అక్కడే మేత మేస్తున్న మేకలు ఆ నీటిని త్రాగాయి. దీంతో 10 మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. మరికొన్ని అస్వస్థతకు గురయ్యాయి. దాహార్తి తీసుకునేందుకు వెళ్లిన మేకలు కండ్ల ముందే విగతజీవులుగా మారడంతో మేకల కాపరరుల కుటుంబాలు బోరున విలపించారు.
కష్టపడి పెంచుకుంటున్న మేకలు నీళ్లు తాగి మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనతో సుమారు రూ.1,60,000 నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Vice president | ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి..!
Yellampally project | ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పై నుంచి రాకపోకలు బంద్
TLM Mela | టీఎల్ఎం మేళాతో బోధన సులభతరం : ఎంఈవో చంద్రశేఖర్ రెడ్డి