Vice president : ప్రతిపక్ష ఇండియా కూటమి (INDI block) తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి (B Sudarshan Reddy) ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అధికారికంగా ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలోని ఆకుల మైలారం సుదర్శన్‌రెడ్డి స్వస్థలం. ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి నాలుగున్నరేళ్లపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత యన గోవా లోకాయుక్త ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. గోవా తొలి లోకాయుక్తగా ఆయన గుర్తింపు పొందారు. సుదర్శన్ రెడ్డి 2007 నుంచి 2011 వరకు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. అంతకుముందు 2005లో గువాహటి హైకోర్టు జడ్జిగా పనిచేశారు.
కాగా అధికార ఎన్డీఏ కూటమి ఇప్పటికే తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసింది. దాంతో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్‌తో జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి తలపడనున్నారు.