Sreeleela | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). హరీష్ శంకర్ ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. రాశీఖన్నా కీ రోల్ పోషిస్తోంది. టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది శ్రీలీల.
రాశీ ఖన్నా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని స్క్రిప్ట్ వినకుండానే ఒప్పుకుందని ఇప్పటికే హరీష్ శంకర్‌తోపాటు రాశీఖన్నా కూడా పలు సందర్భాల్లో చెప్పిందని తెలిసిందే. ఇలాంటి విషయాన్నే ఒకటి శ్రీలీల షేర్ చేసుకుంది. అయితే ఇది కథ గురించి మాత్రం కాదు. తన షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పింది శ్రీలీల. హరీష్ శంకర్ తాను ప్రిపేర్ కావడానికి ఎప్పుడూ తనకు షూటింగ్‌కు ముందు కానీ లేదా షూటింగ్ కంటే ముందు రోజు కానీ ఏ స్క్రిప్ట్ లేదా మెటీరియల్‌ను ఇవ్వలేదని చెప్పింది. నేను సెట్లోనే షూట్ కోసం ప్రిపేర్ అయ్యాయని చెప్పింది. మొత్తానికి లొకేషన్లోనే షూట్ ప్రిపేర్ అయి ఎంత ప్రొఫెషనల్ కమిట్ మెంట్ ఉందో చెప్పకనే చెబుతోంది శ్రీలీల.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పార్థీబన్ విలన్‌గా నటిస్తుండగా.. గౌతమి, కేఎస్ రవికుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ పాటలు కంపోజ్ చేస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ఎస్ థమన్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ నెట్టింట దుమ్ములేపుతున్నాయి.
MP Shanmugam | ‘నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా’.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..?
Hema- Surekha | తోటలో ఎంజాయ్ చేసిన హేమ- సురేఖవాణి.. ఈతకల్లు తాగుతూ హల్చల్
Faisal Malik | బాలీవుడ్ ‘రామాయణ’లో కుంభకర్ణుడిగా ‘పంచాయత్’ నటుడు!