Mookuthi Amman 2 | 2020లో డివోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం Mookuthi Amman. ఆర్జే బాలాజీ స్వీయదర్శకత్వంలో లీడ్ రోల్లో నటించిన ఈ మూవీలో నయనతార టైటిల్ రోల్ పోషించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న ప్రాజెక్టు Mookuthi Amman 2. సుందర్ సీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీలో మహాశక్తి టైటిల్‌తో విడుదల కానుంది.
వినాయకచవితి సందర్భంగా టీజర్ లాంచ్ చేశారు. దీంతోపాటు నవంబర్ 6న సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. టీజర్లో అమ్మ బిడ్డున్న చోటును చేసుకొని శత్రువులు గ్రామం దగ్గర దాకా వచ్చేశారని ఓ సేవకుడు చెబుతుండగా.. అశ్వాలపై ముష్కరులు రావడాన్ని చూడొచ్చు. శత్రువులొచ్చేశారు. మన ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే రాకుమారుడిని కాపాడుకోవాలి. నా బిడ్డను కాపాడు నీకు మొక్కు చెల్లిస్తా.. నీకు సమర్పించడానికి నా దగ్గర ఇంకా ఏం లేదు.. నా ప్రాణాలు తప్ప.. అని రాకుమారుడి తల్లి ప్రాణాలు తీసుకుంటుంది. చివరగా అమ్మవారి తన ఒడిలో రాకుమారుడిని ఒడిలో పెట్టుకుని రక్షణగా నిలుస్తుంది. టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
సీక్వెల్లో దునియా విజయ్, యోగిబాబు, రెజినా కసాండ్రా, ఊర్వశి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, అవ్ని సినిమాక్స్, రౌడీ పిక్చర్స్ ఇవి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి హిప్ హాపా తమిఝా అధి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Walking vs Yoga | నడక మంచిదా.. యోగా మంచిదా? మీ ఆరోగ్యానికి ఏది సరైనదో తెలుసుకోండి