Asian Champions Trophy | భారత్ పర్యటనకు పాకిస్థాన్ హాకీ జట్టు.. ఎప్పుడంటే..?
Asian Champions Trophy : అంతర్జాతీయ క్రికెట్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న భారత్, పాకిస్థాన్.. హాకీ విషయంలోలో మాత్రం కాస్త పట్టు సడలిస్తున్నాయి. ఆసియాన్ ఛాంపియన్స్ ట్రోఫీ (Asian Champions Trophy) కోసం పాక్ బృందం ఇండియాకు రానుంది.
Asian Champions Trophy : అంతర్జాతీయ క్రికెట్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న భారత్, పాకిస్థాన్.. హాకీ విషయంలోలో మాత్రం కాస్త పట్టు సడలిస్తున్నాయి. త్వరలో జరుగనున్న ఆసియాన్ ఛాంపియన్స్ ట్రోఫీ (Asian Champions Trophy) కోసం పాక్ పురుషుల బృందం ఇండియాకు రానుంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో పాక్ హాకీ జట్టు ఆడనుందనే విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bagwant Mann) సోమవారం అధికారికంగా వెల్లడించారు.
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు గగనమైన వేళ అంతర్జాతీయ వేదికల్లో మాత్రమే తలపడుతున్నాయి దాయాదులు. ఇటీవలే..ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌లో ఎదురుపడిన భారత్, పాక్ జట్లు ఈసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. ఇండియా ఆతిథ్యమిస్తున్ను ఈ టోర్నీలో పాక్ ఆడనుంది. పంజాబ్‌లో జరుగున్న ఈ మెగా ఈవెంట్ కోసం అక్టోబర్‌లో పాక్ పురుషుల హాకీ బృందం భారత్‌కు రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు.
VIDEO | Chandigarh: Pakistan will be among the six countries that would compete in next month’s Men’s Asian Champions Trophy hockey tournament here, Punjab Chief Minister Bhagwant Mann said on Monday, citing the union government’s policy which allows the arch-foes to play on… pic.twitter.com/1R492gT3Og
— Press Trust of India (@PTI_News) September 14, 2026
‘ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ బహుళ దేశాలు పాల్గొనే టోర్నీ కాబట్టి ఏ సమస్యా ఉండదు. అయితే.. అందరూ అనుకుంటున్నట్టు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండదు’ అని ఆయన పేర్కొన్నారు. హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్, పాక్ హాకీ సమాఖ్య మధ్య సంబంధాలు మంచిగానే ఉన్నాయని తెలిపాడు.
‘భారత్, పాక్ హాకీ సమాఖ్యల మధ్య సత్సంబంధాలే ఉన్నాయని నేను ఓపెన్‌గా చెబుతున్నా. దాయాదిపై టీమిండియా గెలిచినప్పుడు.. నేను పాక్ ఆటగాళ్లను కూడా కలుస్తా. వారు నాపట్ల ఎంతో గౌరవం కనబరుస్తారు’ అని భోలానాథ్ సింగ్ చెప్పారు. అక్టోబర్ 27 నుంచి జలంధర్‌లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవ్వనుంది. ఈ టోర్నీలో భారత్, చైనా, జపాన్, మలేషియా, దక్షిణ కొరియా, పాకిస్థాన్‌లు పాల్గొననున్నాయి. నవంబర్ 5వ తేదీన మొహాలీలో ఫైనల్ ఉంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

