ఈఎస్ఐలో అందని వైద్యం.. కార్మికుల అవస్థలు
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గ్రామంలో ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్యం సకాలంలో అందక, కనీస సౌకర్యాల కొరతతో కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా 24 గంటలు వైద్యం అందించడంతో పాటు..
– ఈఎస్ఐ డిస్పెన్సరీ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల నిరసన
బూర్గంపహాడ్, మార్చి 17 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గ్రామంలో ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్యం సకాలంలో అందక, కనీస సౌకర్యాల కొరతతో కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా 24 గంటలు వైద్యం అందించడంతో పాటు అవసరమైన మందులు కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఈఎస్ఐ ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్ సానికొమ్ము రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. డిస్పెన్సరీలో మందులు, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కార్మికులకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన అంబులెన్స్ సౌకర్యం కూడా లేకపోవడం దారుణమన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి డిస్పెన్సరీలో మెరుగైన వైద్యసేవలు అందించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల సభ్యులు ఉర్లగొండ వీరన్న, కందాల వెంకటరెడ్డి, జగదీష్, సీహెచ్ ఆంజనేయులు, కె.నాగయ్య, చుక్కపల్లి బాలాజీ, కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

