Kantara Chapter 1 | కన్నడ నటుడు రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాంతార చాప్టర్ -1.(Kantara Chapter 1) బ్లాక్‌బస్టర్ మూవీ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 02న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ఇప్పటికే కథానాయిక రుక్మిణి వసంత్‌ని పరిచయం చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో కీలక పాత్రను పరిచయం చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కులశేఖర (Kulashekara) పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టర్ చూస్తుంటే గుల్షన్ ఇందులో విలన్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
హొంబాలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అజ్నిశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు.
Introducing @gulshandevaiah as ‘KULASHEKARA’ from the world of #KantaraChapter1.
‘ಕುಲಶೇಖರ’ನಾಗಿ ಗುಲ್ಶನ್ ದೇವಯ್ಯ.
‘कुलशेखर’ के रूप में गुलशन देवैया.
‘కులశేఖర’గా గుల్షన్ దేవయ్య.
‘குலஷேகரன்’ ஆக குல்ஷன் தேவ்வையா.
‘കുലശേകരൻ’ ആയി ഗുൽഷൻ ദേവയ്യ.
কুলশেখরের চরিত্রে গুলশান দেওয়্যাইয়া.In… pic.twitter.com/DpVkoxvs3s
— Kantara – A Legend (@KantaraFilm) August 19, 2025