హాజీపూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట గోదావరి నది పైన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు(Yellampally project) పైన నుంచి రాకపోకలను నిలిపి వచ్చినట్లు హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే, ఎస్ఐ స్వరూప్ రాజ్ తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షలకు ప్రాజెక్టు లోనికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటతో 35గేట్లను ఎత్తి 3,41,775 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | రెండు రోజులు.. మూడు ఘటనలు.. కరెంటు షాక్తో ఎనిమిది మంది మృతి
Trending News | మెక్సికో అమ్మాయితో గన్నవరం కుర్రాడి పెళ్లి.. పెళ్లి ఫొటోలు వైరల్