నెన్నెల : విద్యార్థులకు సులభతరంగా భోదన చేయడానికి ఉపాధ్యా బోధనోపరణాల మేళాలు ఎంతో ఉపయోగ పడుతాయిని మండల విద్యాధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవడం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మండల స్థాయి టీఎల్ఎం మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎల్ఎం మేళాతో పిల్లలకు సులభతరంగా బోధన చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మేళాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు పిల్లల మనస్సులో నిలిచిపోతాయన్నారు.
రేఖాచిత్రాలు, బొమ్మలు, విత్తనాలు, కాగితాలు, వివిధ వస్తువులతో తయారు చేసి ఏర్పాట్లు చేసారని వాటిని విద్యార్థుల మధ్య ప్రదర్శించరన్నారు. ఇక్కడ ప్రదర్శించిన ఎగ్జిబిట్లలో ప్రతిభ కనబర్చిన వాటిని మండల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా మొదటి బహుమతి వచ్చేలా టీచర్లు అందరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అవుడం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మి, నెన్నెల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, డిఆర్పి ఖాదర్ పాల్గొన్నారు.