ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధి నకిరిపేట పరిధిలోని దోమలవాగుకు సీతారామ ప్రాజెక్టు నీటిని ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు.
– దోమలవాగుకు సీతారామ నీళ్లు విడుదల
బూర్గంపహాడ్, మార్చి 11 : ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధి నకిరిపేట పరిధిలోని దోమలవాగుకు సీతారామ ప్రాజెక్టు నీటిని ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నకిరిపేట పరిధిలోని దోమలవాగు ఈ ప్రాంత రైతులకు జీవనాధారంగా ఉందని, దోమలవాగుకు రూ.186 కోట్లు వెచ్చించి త్వరలో మినీ రిజర్వాయర్ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం దోమలవాగు పరిధిలో 600 నుండి 800 ఎకరాలకు సాగునీరు అందుతుండటంతో రైతులు పంటలు ఎండిపోకుండా కాపాడుకున్నట్లయిందన్నారు. దోమలవాగు మినీ రిజర్వాయర్ అయితే 2 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రెండు పంటలకు డోకా ఉండదన్నారు. సాగునీరు సకాలంలో అందితే వరిసాగుతో పాటు ఆకుకూరలు, కూరగాయల సాగు కూడా చేపట్టవచ్చని తెలిపారు.
అనంతరం నకిరిపేటలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్ధులకు అందుతున్న విద్య, మౌలిక సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర విషయాలపై ఆరా తీశారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, వారికి నాణ్యమైన విద్య, భోజనం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, సీతారామ ప్రాజెక్టు ఈఈ తెల్లం వెంకటేశ్వరరావు, ఏఈ గణేషానాయక్, నకిరిపేట సర్పంచ్ సర్పా నాగమణి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ, దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, కైపు శ్రీనివాసరెడ్డి, భజన సతీష్, ప్రసాద్, ఇంగువ రమేష్, బాదం రమేష్‌రెడ్డి, నాగిరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

