High Yields | వర్గల్, జూన్ 11: వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్న ప్రస్తుత తరుణంలో ఆయా గ్రామాల రైతులు వ్యవసాయ నిపుణులు చెప్పే విత్తన ఎంపిక, సాగు పద్దతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని వర్గల్ వ్యవసాయ అధికారిణి శేషశయన తెలిపారు.
బుధవారం మండలంలోని చౌదర్పల్లి, సీతారాంపల్లి, అవుసులోనిపల్లి, నగరంతాండలలో రైతు ముంగిట వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో శేషశయన మాట్లాడుతూ.. రైతులుప్రతి సారి వేసిన పంటే వేయకుండా పంట మార్పిడి పద్దతిని పాటించాలన్నారు.
భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువుల వాడకం చేయాలన్నారు. సాగు పద్దతిని అలవర్చుకొని రైతులు అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎండీ లతీఫ్ పాష , ఏఈవోలు సునీత, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు