Medical Camp | రాయపోల్, ఏప్రిల్ 12 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో చెవి, ముక్కు, గొంతు (ENT) సంబంధిత పరీక్షలు నిర్వహించి గ్రామస్థులకు నాణ్యమైన వైద్య సేవలు అందించారు.
వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, రోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించారు. వైద్య శిబిరంలో పాల్గొన్న 100 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా మరింత మెరుగైన చికిత్స అవసరమైన 36 మందిని ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో డా. మహాలక్ష్మి, డా.శ్రీరాజ్, అమృత, మాధురి, రచన తదితరులు పాల్గొని శిబిరం విజయవంతం కావడానికి సహకరించారు.