Farmers | రాయపోల్, సెప్టెంబర్ 03 : రైతులకు యూరియా కోసం నిత్యం తిప్పలు తప్పడం లేదు.. ఇంకెన్నాళ్లు పడుతుందోనని పలు గ్రామాలు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి దౌల్తాబాద్, రాయపోల్ మండలాల పరిధిలో ఈ వానాకాలం సీజన్లో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడింది. సాగుకు అనుగుణంగా సంబంధిత వ్యవసాయ అధికారులు నిల్వలు ఉంచలేక తమకు ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాయపోల్ మండల కేంద్రానికి లోడ్ యారియా రాగా.. కొంతమందికి మాత్రమే లభించిందని చాలామంది యూరియా దొరకకపోవడంతో వెనుతిరిగి వెళ్లారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ సెంటర్ కు యూరియా రాగా పలు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలు తరలివచ్చారు. దీంతో యారియా కోసం వచ్చిన రైతులు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి క్యూలైన్ కట్టినా బస్తా యారియా దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
యూరియా సకాలంలో అందించడంలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహించిన రైతాంగం శివాజీ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. యారియా సకాలంలో అందించాలని రెండు మండలాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. తిండి తిప్పలు మానుకొని బస్తా యూరియా కోసం పనులు వదులుకొని పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా యూరియా అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Anushka Shetty | అనుష్క సరోజ 2 చేయాలని చెప్పిందట.. ఇంతకీ క్రిష్ ప్లాన్ ఏంటో మరి..?
SSMB 29 | రాజమౌళి – మహేశ్ బాబు సినిమా.. కెన్యా మసాయి మరా వైపే అందరిచూపు.!
Akshay Kumar | గురువాయూర్ ఆలయాన్ని దర్శించుకున్న అక్షయ్ కుమార్