ROAR 26 | సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. రెహమాన్ కచేరీతో ‘ROAR 26’ ఈవెంట్..!
ROAR 26 : చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా టోర్నీకి ప్రారంభానికి ముందే.. చిదంబరం (చెపాక్) స్టేడియంలో 'ROAR 26' అనే స్పెషల్ లైవ్ షోతో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించనుంది.
ROAR 26 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ సమీపిస్తున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరంభ సీజన్ నుంచి తమ జట్టుపై ప్రేమాభిమానాలు కురిపిస్తూ.. మద్దతుగా నిలుస్తున్న అభిమానుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. మెగా టోర్నీకి ప్రారంభానికి ముందే.. చిదంబరం (చెపాక్) స్టేడియంలో ‘ROAR 26’ అనే స్పెషల్ లైవ్ షోతో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించనుంది. ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యం శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
విజిల్ పోడు అంటూ… చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రహ్మరథం పట్టే అభిమానులను అలరించేందుకు ఫ్రాంచైజీ మ్యూజికల్ నైట్ నిర్వహించనుంది. మెగా టోర్నీకి ఆరు రోజుల ముందు అంటే.. మార్చి 22 ఆదివారం నాడు చిదంబరం మైదానంలో ROAR 26 అనే స్పెషల్ జరుపనుంది. ఈ నైట్ షోలో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) తన పాటల హోరుతో ఫ్యాన్స్‌ను ఫిదా చేయనున్నారు.
FOR THE FIRST TIME EVER!
CSK stars, OG Super Kings and A.R. Rahman are coming together for one unforgettable night! 🥳
22 March | M.A. Chidambaram Stadium
Tickets Live from 11am, March 15 on CSK APP/website and the District App
For more details
Link : https://t.co/P1COtnON65… pic.twitter.com/53tparPiK5— Chennai Super Kings (@ChennaiIPL) March 14, 2026
ప్రస్తుతం స్క్వాడ్‌లోని ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్ సహా ఇతర ఆటగాళ్లు పాల్గొననుండగా. ఓజీ సూపర్ కింగ్స్ టీమ్‌గా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, మాథ్యూ హెడేన్, మురళీ విజయ్, బద్రీనాథ్ తదితరులు ఈ ఈవెంట్లో సందడి చేయనున్నారు. సో.. ఈ ప్రత్యేక కార్యక్రమం టికెట్లను ఫ్రాంచైజీ అమ్మకానికి పెట్టింది. మార్చి 15వ తేదీ నుంచి ఫ్రాంచైజీ అధికారిక వెబ్సైట్లో.. డిస్ట్రిక్ట్ యాప్, District.in platformలో టికెట్లు అందుబాటులో ఉంటాయని సీఎస్కే యాజమాన్యం వెల్లడించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

