Farmers Protest | రాయపోల్, సెప్టెంబర్ 01 : గంటలు.. రోజుల తరబడి వేచి ఉన్నా రైతులకు మాత్రం యూరియా కష్టాలు తప్పడం లేదు. తిండీ తిప్పలు మానేసి షాపుల వద్ద క్యూలైన్లలో నిలబడి ఉన్నా యూరియా ఇవ్వకపోవడంతోరైతన్నలు రోడ్డుపై బైఠాయించి గంటపాటు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వ్యవసాయ శాఖ అధికారులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులు గడుస్తున్న యూరియా అందించడంలో అధికారులు విఫలం చెందారని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజుల నుంచి యారియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రతిరోజు షాపుల ముందు పడిగాపులు కాస్తున్నప్పటికీ యూరియా అందించడంలో అటు వ్యవసాయ అధికారులు పట్టించుకోవడంలేదని. ఆగ్రహించిన రైతాంగం వివిధ గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ధర్నా, రాస్తారోకో సుమారు గంట పాటు సాగడంతో దారిపొడవునా వాహనాలు నిలిచిపోయి రహదారి స్తంభించిపోయింది.
ఈ సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మానస పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు వినిపించుకోకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఈ సమాచారాన్ని మండల ఏవో నరేష్‌కు అందించగా.. ఆయన వెంటనే అక్కడికి చేరుకొని రైతులకు యూరియా అందిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ రైతులు వినిపించుకోకుండా నాలుగు రోజులు తాము తిండి తిప్పలు మాని షాపుల ముందు ఉంటే కనీసం ఎవరూ కూడా స్పందించడం లేదని రైతులు మండిపడ్డారు.
రైతులు ఆందోళన విరమించాలని యూరియాను అందించేందుకు తాను కృషి చేస్తానని మంగళవారం ఉదయం రైతులందరికీ యారియా సరఫరా అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా రైతులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు రాజిరెడ్డి, ఇప్ప దయాకర్. మండల నాయకులు పరశురాములు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
BRS | కేసీఆర్‌పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
Lakshmi Devipalli | బావోజి తండాలో తాగు నీటి సమస్యను పరిష్కరించండి
Karepalli | ఆదర్శంగా నిలుస్తున్న కారేపల్లి క్రాస్ రోడ్ యువత.. ఆపద సమయంలో అండగా నిలుస్తున్న యువకులు