Machines | రాయపోల్, ఆగస్టు 23 : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2025-26లో భాగంగా రైతులకు యాంత్రీకరణలో సహాయం అందించబడుతుందని రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ రైతులకు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మహిళా రైతులు, చిన్న రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50% సబ్సిడీ, ఇతర రైతులకు 40% సబ్సిడీ అందించనున్నట్టు పేర్కొన్నారు.
రాయపోల్ మండల పరిధిలోని రైతులకు 5 రోటావేటర్లు, 5 పవర్ నాక్ తైవాన్ స్పియర్లు ,1 పవర్ వీడర్ అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆయా యంత్రాలు కావాల్సిన రైతులు తమ వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద ఈ క్రింద తెలిపిన దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, ట్రాక్టర్ ఆర్సీతో దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నరేష్ పేర్కొన్నారు.
Bibinagar : బీబీనగర్ ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి : పిట్టల అశోక్
Peddapally | యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త శ్యామల
Sanjay Dutt | సంజూ భాయ్ అతడిని అలా కొట్టాడేంటి.. వైరల్ అవుతున్న వీడియో