Rayapol SI | రాయపోల్, ఏప్రిల్ 23 : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విద్యార్థులు చల్లదనం కోసం చుట్టుపక్కల ఉండే కుంటలు, చెరువుల వద్దకు వెళ్లొద్దని రాయపోల్ ఎస్సై రఘుపతి సూచించారు. స్నేహితుల ప్రోద్భలంతో ఈతకు వెళ్లడం లాంటివి చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని ఎస్సై రఘుపతి పేర్కొన్నారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. చెరువులు, కుంటల వద్దకు ఎటువంటి రక్షణ సదుపాయాలు లేకుండా వెళ్లనీయొద్దని తల్లిదండ్రులకు నిర్దేశించారు. సరైన ఈత రాకుంటే నీళ్లలో మునిగిపోయి చనిపోయే ప్రమాదం ఉందని.. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై రఘుపతి సూచించారు.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి