Mrigashira Karte | మృగశిర కార్తె అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది చేపలు. ఈ కార్తె ఆరంభం రోజున చేపలు తినడం ఆనవాయితీ. దీర్ఘకాలిక అనారోగ్యాలకు విరుగుడుగా మృగశిర రోజున పచ్చి చేపల పులుసు లేని ఇల్లంటూ ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉబ్బసం, ఆయాసం ఉన్నవారు ఈ రోజు తప్పక చేపల కూరతో తినాలని పెద్దల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.
మృగశిర కార్తె కావడంతో ఆదివారం చేపల మార్కెట్ సందడిగా మారింది. గత ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో చెరువులో చేప పిల్లలు పోయడంతో నేడు మత్స్యకారులకు వరంగా మారింది. మత్స్యకారులు ఆ చేపలనే పట్టుకొని జీవనం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి వరకు చెరువులో చేప పిల్లలను పోయలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపలు వేరే ర్రాష్టాల నుండి తెప్పియాల్సిన పరిస్థితి నెలకొంటుందని వాపోయారు.
చేపల మార్కెట్లో సందడి..
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్భవన్లో ప్రమాణస్వీకారం పూర్తి