చిలిపిచెడ్, జూన్ 8 : ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జగ్గంపేట ఎంపీపీఎస్ పాఠశాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూడవరోజు గ్రామంలో విద్యార్థుల ఇంటిఇంటికి తిరుగుతూ మీ పిల్లలను ప్రభుత్వపాఠశాలలో చేర్పించలని తల్లి తండ్రులకు చెప్పామన్నారు.
ప్రభుత్వపాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, యూనిపామ్స్, మధ్యాహ్న భోజనం, రాగి జావా, అందిస్తారని తెలియచేశారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో ఏఐ విద్యను ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శేఖర్, ఉపాధ్యాయురాలు మౌనిక, ఉప సర్పంచ్ పి. శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులు, తల్లీ తండ్రులు పాల్గొన్నారు.