MLA Palla rajeshwar reddy | చేర్యాల, మార్చి 23 : కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో జనగామ నియోజకవర్గంలోని రిజర్వాయర్లకు గోదావరి జలాలు రాలేదని.. దీంతో వేలాది ఎకరాల్లో రైతుల పంటలు ఎండిపోయాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-3లో భాగంగా నిర్మించిన దేవన్నపేట పంపుహౌస్ నుంచి మోటారు ప్రారంభించి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వంతోపాటు చేర్యాల ప్రాంత బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో దేవాదుల ప్రాజెక్టు ఫేజ్-3ను ఇవాళ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదుల కథ రాస్తే రామాయణం వింటే మహాభారం అంత ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్లో వచ్చి గోదావరి నది తీరాన శంకుస్ధాపన చేసి వెళ్లిపోయాడు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదులను పట్టించుకోలేదని.. కేవలం 40 వేల ఎకరాలే నీరు ఇచ్చిందన్నారు.
కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ దేవాదుల కోసం రూ.5 లక్షల 14వేల ఎకరాలకు నీరు అందే విధంగా నిధులు కేటాయించారు. ఫేస్ 1, ఫేస్ 2 పూర్తి చేసి ఫేస్ 3లో భాగంగా రామప్ప దగ్గర దేవన్నపేట వరకు టన్నెల్ నిర్మాణం, దేవన్నపేట దగ్గర నుంచి ధర్మసాగర్ వరకు పంపులకు సంబంధించిన నిర్మాణ పనులను మొదలు పెట్టి రూ.1250 కోట్ల నిధులు కేటాయించారు. కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని టెండర్లు తదితర పనులను పూర్తి చేసి టన్నెల్ నిర్మానం చేయంచి మోటర్లు తెప్పించి భిగించినట్లు తెలిపారు. కానీ మోటార్లను ఆన్ చేయమంటే కాంగ్రెస్ సర్కారుకు అవగాహన లేదని, మోటర్లు ఎక్కడ ఉంటాయో తెలియదని, పంపులు ఎక్కడ ఉన్నాయో, టన్నెల్ గురించి అసలే అవగాహన లేదన్నారు.
జనగామ నియోజకవర్గంలోని కొమురవెల్లి మండలం తపాస్‌పల్లి, మద్దూరు మండలంలోని లద్నూర్తో పాటు బొమ్మకూరు, చీటకోడూరు, గండిరామారం రిజరావయర్లకు నీరు రావాలంటే ధర్మసాగర్ నుంచి రావాలన్నారు. ధర్మసాగర్‌కు చలివాగు నుంచి నీల్లు రావాలని, చలివాగుకు బీంఘనపూర్ నుంచి రావాలని, బీంఘనపూర్కు గోదావరి తీరం నుంచి గోదావరి జలాలు వస్తాయన్నారు.
రైతాంగానికి ఎంతో ఉపయోగపడే నీటి కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కమాటా మాట్లాడలేదని, చివరికి తానే సంబంధిత ఏఈ, డీఈ, ఎస్ఈ, సీఈ, ఈఎన్సీ, ఇరిగేషన్ సెక్రటరీతో పాటు ఇరిగేషన్ మంత్రికి దృష్టికి తీసుకుపోయాయనన్నారు.
ముఖ్యంగా జనగామ, చేర్యాల ప్రాంతాల్లో 50శతం పంటలు పూర్తిగా ఎండిపోయాయని రైతులకు కలిగిన రూ.600కోట్ల నష్టాన్ని ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. చేతకాని చేవలేని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, ప్రస్తుతం ఉన్న సిస్టమ్‌ను సరిగా పని చేయించలేక సమ్మె చేసిన సిబ్బందికి డబ్బులు ఇవ్వలేక రైతాంగానికి తీరని నష్టం చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే పంపులు ఆన్‌చేసి కొద్దొగొప్పొ ఉన్న పంటలను కాపాడాలని కోరారు.
Current Wires | ఇంటిపై విద్యుత్ తీగలు.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?