Farmers | తొగుట : అకాల గాలి వర్షం మూలంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ కురిసిన గాలి వాన మూలంగా మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన సుతారి ఆంజనేయులుకు చెందిన మునుగె చెట్లు పడిపోవడంతో వాటిని పరిశీలించారు.
గాలి వాన మూలంగా మునిగె చెట్లతోపాటు మొక్కజొన్న చేలు పడిపోవడం జరిగిందని, మామిడి కాయలు సైతం రాలిపోవడం జరిగిందని రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతులకు వడగండ్లు, గాలి వానల మూలంగా తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు.
ఎకరా మునుగ చెట్లు గాలి వాన మూలంగా పడిపోయాయని, తీవ్రంగా నష్టపోయానని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆంజనేయులు కోరుతున్నారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం