రామాయంపేట, ఏప్రిల్ 30 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేడి పదార్ధాలనే భుజించేలా చర్యలను చేపట్టే విధంగా వైద్య సిబ్బంది గ్రామాల బాట పట్టాలని డీ.ధర్మారం పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ హరిప్రియ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని డీ.ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్లు, ఏఎన్ఎంలకు అవగాహన కల్పించి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వర్షాకాలం ఉన్నందున ప్రజలకు ఎప్పటి కప్పడు ఇంటికి వెళ్లి మాత్రలను అందజేయాలన్నారు.
ప్రతిరోజు గ్రామాలలోనే ఉండి ప్రజల కష్ట సుఖాలను తెలుకోవడం వైద్య సిబ్బంది బాధ్యతని అన్నారు. ప్రజలు మురికి కాల్వల మూలంగా సీజనల్ వ్యాధులకు గురయ్యే ప్రమదాలు ఎక్కువగా ఉంటాయని వాటిని దరిచేరకుండా తక్షణ చర్యలను ఆరోగ్య సిబ్బంది తీసు కోవాలన్నారు. ప్రతి వ్యక్తికి ప్రతిరోజు బీపీ, షుగర్ పరీక్షలను చేయాలన్నారు. కుళాయిలలో నిల్వ ఉన్న నీటిని పారబోయాలన్నారు. ఎండవేడిమి కారణంగా ప్రజలు వివిధ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉదన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పీఎచ్ఎన్ఎం.సత్తమ్మ, సూపర్ వైజర్లు, ఏఎన్ఎంలు ఉన్నారు.