వనపర్తి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): వనపర్తి మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేపట్టవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. మెడికల్ కళాశాలలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం కోసం 8 ఎకరాల స్థలం కేటాయించడాన్ని మెడికల్ కళాశాల విద్యార్థులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి శుక్రవారం మెడికల్ కళాశాలను సందర్శించి విద్యార్థులు, మీడియాతో మాట్లాడారు. 2021లో జిల్లా కేంద్రంలో 50 ఎకరాలు మెడికల్ కళాశాల కోసం కేటాయించామని గుర్తుచేశారు. అనంతరం స్కూల్ నిర్మాణం చేపట్టవద్దని మంత్రి దామోదర రాజనరసింహకు లేఖ రాశారు. అవసరమైతే తన సొంత వ్యవసాయ స్థలం ఇవ్వడానికైనా సిద్ధమని చెప్పారు.