రాష్ట్రంలో 30 శాతం లోటు వర్షపాతం
రాష్ట్రంలో ఆగస్టులో కూడా లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. 12జిల్లాల్లో -21 నుంచి -45 వరకు లోటు వర్షపాతం నమోదవుతున్నది. ఆగస్టులో సాధారణ సగటు వర్షపాతం 215.8 మి.మీగా ఉంది. బుధవారం నాటికి 87.6 మి.మీ వర్షపాతం కురువాల్సి ఉండగా, కేవలం 71.2 మి.మీ నమోదైంది.
- పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో ఆగస్టులో కూడా లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. 12జిల్లాల్లో -21 నుంచి -45 వరకు లోటు వర్షపాతం నమోదవుతున్నది. ఆగస్టులో సాధారణ సగటు వర్షపాతం 215.8 మి.మీగా ఉంది. బుధవారం నాటికి 87.6 మి.మీ వర్షపాతం కురువాల్సి ఉండగా, కేవలం 71.2 మి.మీ నమోదైంది. దీంతో ఈనెలలో 19 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో జూన్ 1 నుంచి బుధవారం వరకు -30 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
గత 24 గంటల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేటలో అత్యధికంగా 8.39 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం కారణంగా ఈనెల 18 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించారు. గురువారం భద్రాద్రి -కొత్తగూడెం, హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబాబాద్, మహబూబ్నగర్, మెదక్, నాగర్కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షం కురిసే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

